ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు.బడ్జెట్‌లో మహిళలు, చిన్నారులకు పెద్దపీట వేసినట్లు బుగ్గన తెలిపారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి.
రూ. 2,29,779.27 కోట్ల విలువైన బడ్జెట్‌ను బుగ్గన ప్రవేశపెట్టారు.
గత ఏడాది బడ్జెట్ రూ. 2,24,789.18 కోట్లు కాగా ఈసారి స్వల్పంగా పెరిగింది.
ఎవరెవరికి ఎంతెంత..?
- 2020–21తో పోలిస్తే వెనకబడిన కులాల బడ్జెట్‌లో 32 శాతం అధికంగా కేటాయింపులు (రూ. 28,237 కోట్లు) చేశారు.
- ఈబీసీ సంక్షేమంలో 8 శాతం అధిక కేటాయింపులు (రూ. 5,478కోట్లు) చేశారు.
- కాపు సంక్షేమం కోసం 7 శాతం అధిక కేటాయింపులు (రూ. 3,306 కోట్లు) చేశారు.
- బ్రాహ్మణుల సంక్షేమంలో 189 శాతం అధిక కేటాయింపులు (రూ. 359 కోట్లు) చేశారు.
- మైనార్టీ యాక్షన్ ప్లాన్‌కింద రూ. 3,840.72 కోట్లు కేటాయించారు. దీనిలో ఏడు శాతం పెరుగుదల కనిపించింది.
- పిల్లలు, చిన్నారుల కోసం బడ్జెట్‌లో రూ. 16,748 కోట్లు కేటాయించారు.
- మహిళల అభివృద్ధికి రూ. 47,283.21 కోట్లు కేటాయించారు.
- వ్యవసాయ పథకాలకు రూ. 11,210 కోట్లు కేటాయింపులు చేశారు.
- విద్యా పథకాలకు రూ. 24,624 కోట్లు కేటాయింపులు చేశారు.
- వైద్యం– ఆరోగ్యానికి రూ. 13,830 కోట్లు కేటాయింపులు చేశారు.
డీబీటీ పథకాల వారీగా కేటాయింపులు
- వైయస్సార్ పెన్షన్ కానుకకు రూ. 17,000 కోట్లు
- వైయస్సార్ రైతు భరోసాకు రూ. 3,845 కోట్లు
- జగనన్న విద్యా దీవెనకు రూ. 2500 కోట్లు
- జగనన్న వసతి దీవెనకు రూ. 2,223.15 కోట్లు
- వైయస్సార్ – పీఎం ఫసల్ బీమా యోజనకు రూ. 1,802 కోట్లు
- డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ.865 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు, మొత్తంగా రూ. 1,112 కోట్లు
- రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపులు కోసం రూ. 500 కోట్లు
- వైయస్సార్ కాపు నేస్తంకోసం రూ. 500 కోట్లు
- వివిధ పథకాల కింద కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం రూ. 3,306 కోట్లు
- వైయస్సార్ జగనన్న చేదోడు పథకం కోసం రూ. 300 కోట్లు
- వైయస్సార్ వాహన మిత్ర పథకం కోసం రూ. 285 కోట్లు
- వైయస్సార్ నేతన్న నేస్తంకోసం రూ. 190 కోట్లు
- వైయస్సార్ మత్స్యకార భరోసా కోసం రూ. 120 కోట్లు
- మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం రూ. 50 కోట్లు
- అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులకోసం రూ. 200 కోట్లు
- వైయస్సార్ ఆసరా కోసం రూ. 6,337 కోట్లు
- అమ్మ ఒడి కోసం రూ. 6,107 కోట్లు
- వైయస్సార్ చేయూత కోసం రూ. 4,455 కోట్లు
- రైతుల పథకాలకు రూ. 11,210.80 కోట్లు
- వైయస్సార్ టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ. 88.57 కోట్లు
- వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1802.82 కోట్లు
- వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ. 739.46 కోట్లు
- వైయస్సార్ పశువుల నష్టపరిహార పథకానికి రూ. 50 కోట్లు
విద్యారంగానికి రూ.24,624.22 కోట్లు
- స్కూళ్లలో నాడు–నేడుకు రూ. 3,500 కోట్లు
- జగనన్న గోరు ముద్ద కోసం రూ. 1,200కోట్లు
- జగనన్న విద్యా కానుక కోసం రూ. 750 కోట్లు
- ఉన్నత విద్యకోసం రూ. 1,973 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు
- డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ, మందుల కొనుగోలు కోసం రూ. 2,248.94 కోట్లు
- ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలకోసం రూ. 1,535 కోట్లు
- కోవిడ్‌పై పోరాటానికి రూ. 1000 కోట్లు
- ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్ కోసం రూ. 100 కోట్లు
- పలాస ఆస్పత్రికి రూ. 50 కోట్లు
హౌసింగ్, మౌలిక సదుపాయాల కోసం మొత్తంగా రూ. 5,661 కోట్లు
- పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ. 1000 కోట్లు
- వైయస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కోసం రూ. 200 కోట్లు
- కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ. 250 కోట్లు
- ఏపీఐఐసీకి రూ. 200 కోట్లు
- ఎంఎస్‌ఎంఈల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ . 60.93 కోట్లు
- పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ . 3,673.34 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు 2021–22 సంవత్సరంలో రూ. 7,594.6 కోట్లు
- ఎనర్జీ రంగానికి రూ. 6,637 కోట్లు