Home AndhraPradesh ఐన్యూస్ నుంచి తప్పుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.

ఐన్యూస్ నుంచి తప్పుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఐన్యూస్ చానెల్ వదిలేశారు.ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఐన్యూస్ ఛానెల్ లో పార్టనర్ గా చేరారు నల్లారి.సమైక్య నినాదం ఎత్తుకొని ఇటు తెలంగాణ లో అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు.అయితే కొంతకాలంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ లో కీలక బాధ్యతలు అప్పజెబుతారని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరిగింది.కానీ హై కమాండ్ ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు.ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రకు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం రాలేదు.దాంతో రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోవడం తో ఛానెల్ ను కూడా లైట్ తీస్కున్నట్టు టాక్.అందుకే ఐన్యూస్ ఛానెల్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు మీడియా వర్గాల్లో కూడా తెగ చర్చ జరుగుతుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here