బాలీవుడ్ ని దున్నేస్తున్న ప్రియాంక చోప్రా, బేవాచ్ సినిమాలతో హాలీవుడ్‌లోనూ పాపులర్ ఫిగర్ అయ్యింది. హాలీవుడ్ ఎంట్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకుని ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. అప్పుడప్పుడు పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ , వాటి వాళ్ళ ఆమెకు జరిగిన నష్టం ఏం లేదు.
ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఫేమ్ ఒక్క విమర్శతో అది తొలిగిపోదు కదా.
అందుకే తన టాలెంట్ ని గుర్తించిన ప్రఖ్యాత ఫోర్బ్స్, మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్స్ జాబితాలో తనకో ర్యాంక్‌ను కట్టబెట్టింది.ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాలో ప్రియాంక చోప్రా కూడా స్తానం దక్కించుకుంది .తొలి వంద మంది మహిళలలో 97వ స్థానంలో నిలిచింది ప్రియాంక . హాలీవుడ్ సినిమాల్లో నటన.. దీంతో పాటు పలు స్వచ్ఛంద కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకోవడం వలనే ఆమెకి ఆదరణ పెరిగిందని ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ టాప్-100 జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ టాప్-1 స్థానంలో నిలిచారు.