Home Telangana అమెరికాలో క‌ల‌క‌లంః భార‌త అభ్య‌ర్థి ని ఉగ్ర‌వాదిగా పోస్ట‌ర్లు

అమెరికాలో క‌ల‌క‌లంః భార‌త అభ్య‌ర్థి ని ఉగ్ర‌వాదిగా పోస్ట‌ర్లు

అగ్ర‌రాజ్యం అమెరికాలో విద్వేషపూరిత వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ సిక్కు భార‌త అభ్య‌ర్థి ని ఉగ్రవాది అంటూ పోస్టర్లు అతికించారు. న్యూజెర్సీలోని హౌబోకెన్‌ మేయర్‌ అభ్యర్థిగా రవీందర్‌ భల్లా పోటీ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు “మన నగరంలో ఉగ్రవాదాన్ని రానీయొద్దు“ అంటూ ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లును అతికించారు. ఓ మేయర్‌ అభ్యర్థి పట్ల విద్వేషపూరితమైన వ్యాఖ్యలు రాస్తూ పోస్టర్లు అతికించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

వ‌చ్చే మంగళవారం అక్కడ మేయర్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇటీవల అమెరికాలో స్కూల్‌ బోర్డ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు ఆసియా అమెరికన్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా.. గుర్తు తెలియని వ్యక్తులు జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here