భారత నౌకాదళం ప్రారంభించిన కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ ‘సముద్ర సేతు II’లో భాగంగా 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, ఇతర కోవిడ్ సహాయక సామగ్రితో పాటు సింగపూర్, బ్రూనేల నుంచి 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఐఎన్ఎస్ జలాశ్వ ఆదివారం విశాఖపట్నం చేరుకుంది. విదేశాల్లోని భారత రాయబార సంస్థలు సమకూర్చిన ఈ కోవిడ్ రిలీఫ్ సామగ్రిని దేశంలోని వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేస్తారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే లక్ష్యంతో గత ఏడాది మే 5న ‘ఆపరేషన్ సముద్ర సేతు’ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 3,992 మంది స్వదేశానికి తీసుకు వచ్చారు.మెడికల్ ఆక్సిజన్, ఇతర కోవిడ్ సహాయక సామాగ్రిని విదేశాల నుంచి తీసుకు వచ్చేందుకు ఈ ఏడాది మేలో ‘ఆపరేషన్ సముద్ర సేతు II’ను ప్రారంభించారు.