Home National కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు ఎందుకు చైనా ను దోషిగా నిలబెట్టాయి…? అసలు...

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు ఎందుకు చైనా ను దోషిగా నిలబెట్టాయి…? అసలు వూహాన్ నగరంలో ఏమి జరిగింది..??

229
1

                

By Bala.Raviteja Naidu

       మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ…ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను చైనానే ప్రపంచం మీదకు వదిలిందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. బయోవార్‌కు తెరతీసి ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యానికై చైనా ఈ ప్రాణాంతక వైరస్‌ను సృష్టించిదని.. అది బెడిసికొట్టడంతో చైనీయులే మొదటి బాధితులయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ పుట్టుక, కేసులు, మృతుల సంఖ్య వంటి అంశాల్లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలపై అమెరికా సహా ఇతర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ఆనవాళ్లు తొలిసారిగా బయటపడ్డ వుహాన్‌లో కరోనా మరణాలను 1,290 ఎక్కువగా చూపుతూ చైనా తాజా గణాంకాలు విడుదల చేయడంతో వాటికి బలం చేకూరినట్లైంది.

ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ చానెల్‌ వెలువరించిన కథనం సంచలనంగా మారింది. వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తున్న ఇంటర్న్‌ అనుకోకుండా ఈ వైరస్‌ను లీక్‌ చేశారని సదరు మీడియా పేర్కొంది. కరోనా సహజంగానే ఉద్భవించిందని… అయితే ఇది గబ్బిలాల నుంచి మనిషికి సోకిన అనంతరం దానిపై ల్యాబ్‌లో పరిశోధనలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే ఉద్యోగికి వైరస్‌ సోకిందని.. తనకు తెలియకుండానే సదరు వ్యక్తి దీనిని వ్యాప్తి చేశారని ఆ కథనంలో పేర్కొంది. అమెరికాపై పైచేయి సాధించేందుకు చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వైరస్‌ను ఉపయోగించుకోవాలని భావించిందని విశ్వసనీయ వర్గాలు తమకు వెల్లడించినట్లు తెలిపింది.

                              ఇక కరోనా వ్యాప్తి కట్టడి- ఆర్థిక వ్యవస్థ పునురుద్ధరణ తదితర అంశాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్టర్‌ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ‘‘సరైన సురక్షిత చర్యలు తీసుకోకపోవడం వల్లే కరోనా వైరస్‌ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చిందని అమెరికా నమ్ముతోందా. అక్కడ ఇంటర్న్‌కు కరోనా సోకగా.. ఆమె నుంచి బాయ్‌ఫ్రెండ్‌కు.. అక్కడి నుంచి వుహాన్‌ మార్కెట్‌లో వ్యాప్తి చెందింది కదా’’అని ప్రశ్నించగా… ఈ విషయం గురించి అనేక కథలు వింటున్నామని… త్వరలోనే ఈ విపత్కర పరిస్థితికి కారణాన్ని కనిపెడతామని ట్రంప్‌ సమాధానమిచ్చారు. ఇక ఈ విషయం గురించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడారా అని ట్రంప్‌ను అడుగగా… ఆయనతో మాట్లాడిన విషయాలను మీడియాతో పంచుకోలేనని స్పష్టం చేశారు.ల్యాబ్‌ నుంచి లీకయిందని అమెరికా మీడియా కథనాల పట్ల సమగ్ర విచారణ జరుపుతామన్న ట్రంప్‌…

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్‌ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి అమెరికా సన్నద్ధమైంది. చైనా లోని వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి ఈ వైరస్‌ బయటకి వచ్చిందని అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అధ్యక్షుడు ప్రకటించారు.

వూహాన్ మార్కెట్‌లో ఆ గబ్బిలాలు లేవా….??

            కరోనా వైరస్‌ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది.అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్‌ వెట్‌ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్‌ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్‌ సోకిన మొట్టమొదటి పేషెంట్‌ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే కరోనా సోకిందని చెబుతోంది.

ల్యాబ్‌లో భద్రత కరువు….?                                       

          వూహాన్‌లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్‌ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది. చైనాలో అమెరికా దౌత్యవేత్తలు అందించిన సమాచారం ప్రకారం 2018లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పలుమార్లు వూహాన్‌లో వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించారు. అక్కడ సరైన భద్రత ఏర్పాట్లు లేవని, గబ్బిలాల్లో వైరస్‌కు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిశోధనల సమయంలో సార్స్‌ వంటి వైరస్‌లు బయటకు లీకయ్యే అవకాశాలు ఉన్నాయని రెండేళ్ల క్రితమే అమెరికా ప్రభుత్వాన్ని శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టుగా తన కథనంలో పేర్కొంది.

ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు…??

         వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్‌. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్‌ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్‌ మార్కెట్‌ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ)  వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్‌ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి.

చైనాపై అనుమానాలు బలంగా పెరగడానికి కారణాలు….!!

1) ఒక వైపు ప్రపంచం అంతా కరోనా గురించి అల్లకల్లోలం అవుతుంటే ఈ వైరస్ పుట్టిన చైనా లో మాత్రం వైరస్ ముప్పు తప్పిపోయింది అని చైనా ప్రకటన చేయటం యధావిధిగా కార్యకలాపాలు చేయడం.

2) చైనా లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్యను తక్కువ చేసి చూపటం ప్రపంచ దేశాలు అన్ని ముప్పేట దాడి చేయడంతో చివరకు మరణాల విషయంలో తప్పు ఒప్పుకున్న చైనా 50% మరణాలను ఒకేసారి పెంచి చూపింది.దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కొంత మందికి వైద్య సేవలు అంధకపోవడం వల్ల ఇంట్లోనే చనిపోయారని అందువల్లనే మరణాల సంఖ్య సరిగా రిపోర్ట్ కాలేదని చైనా తెలిపింది.

3) వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత అక్కడి స్మశాన వాటికల ముందు తమ కుటుంబ సభ్యుల అస్తికల కోసం వేలాదిగా అక్కడి ప్రజలు తరలి రావడం ఆ వీడియో లు సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడం.

4)  2019 సెప్టెంబర్ లోనే చైనా లో కరోనా వైరస్ బయట పడినా డిసెంబర్ వరుకు ఈ విషయాన్ని చైనా దాచి పెట్టడం. బ్రిటన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.

5) కరోనా వైరస్ అంటూ వ్యాధి కాదని మనుషుల నుండి మనుషులకు కరోనా వైరస్ సోకదని మొదట బుకాయించిన చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా నమ్మించింది.

6) వుహన్లో కొత్త అంటూ వ్యాధి వైరస్ రూపంలో వ్యాపిస్తుందని చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ ను అరెస్ట్ చేసి 40 రోజులు జైలులో ఉంచింది చైనా ప్రభుత్వం. కానీ చివరికి ఈ కరోనా వ్యాధి సోకి డాక్టర్ లీ వెన్లియాంగ్ చనిపోయారు,

7) చైనా లోని ఒక్క వుహాన్ సిటీ లో తప్ప చైనా లోని మరే ఇతర నగరాల్లో కూడా కరోనా రాలేదు అది ఎలా సాద్యం నిత్యం వుహాన్ నుండి వేల  సంఖ్యలో ప్రజలు ఇతర నగరాలకు రాకపోకలను సాగిస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా చైనా చెప్పేది అబద్దమే అని ఇతర దేశాలు అంటున్నాయి.

ఇలాంటి ఎన్నో వివిధ రకాల కారణాలను విశ్లేషించుకొని కరోనా వైరస్ చైనా తప్పిదం వల్లనే బయటకు వచ్చింది అనేది స్పష్టం అవుతుంది.

– By Bala.Raviteja Naidu

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here