Home Entertainment మలావి దేశంలో 20 వేల డోసుల టీకాలను ధ్వంసం…!! కారణమేంటి.. ?

మలావి దేశంలో 20 వేల డోసుల టీకాలను ధ్వంసం…!! కారణమేంటి.. ?

వ్యాక్సీన్ డోసుల సురక్షత గురించి తమదేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే గడువు దాటిపోయిన 19,610 వ్యాక్సిన్లను ధ్వంసం చేసినట్లు మలావి వైద్య కార్యదర్శి తెలిపారు.

ప్రపంచంలో 5 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే ఇప్పటి వరకు వ్యాక్సీన్ లభించినట్లు అవర్ వరల్డ్ ఇన్ డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లను ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?

“చాలా వరకు వ్యాక్సీన్లు వృథా కావు” అని యూకేలోని లివర్‌పూల్‌లో జాన్ మూర్స్ యూనివర్సిటీలో సప్లై చెయిన్ మేనేజ్మెంట్‌‌ సీనియర్ లెక్చరర్ డాక్టర్ శారా స్కిఫ్లింగ్ చెప్పారు.

“కోవిడ్ వ్యాక్సీన్ల గురించి పూర్తి సమాచారం ఇంకా మన దగ్గర పూర్తిగా లేదు. కానీ, వాటి గడువు గురించి మాత్రం మనం కొంచెం సంప్రదాయ రీతిలో ఆలోచిస్తున్నాం. వాటి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉండటం వల్ల వాటిని త్వరగా వాడేయాలి” అన్నారు డాక్టర్ శారా.

మలావికి ఆఫ్రికా నుంచి ఏప్రిల్ 13 వరకు గడువు తేదీ ఉన్న 102,000 డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లు మార్చి 26న సరఫరా అయ్యాయి. అందులో 80 శాతం డోసులను వాడేశారు.

వ్యాక్సీన్లను ఎందుకు ధ్వంసం చేయాలి?

“వ్యాక్సీన్లను ధ్వంసం చేయడం విచారకరం. నేను దానికి కారణాన్ని అర్ధం చేసుకోగలను. మలావిలో వ్యాక్సీన్ తీసుకునేందుకు ప్రజలు సంశయిస్తున్నారు” అని డాక్టర్ స్కిఫ్లింగ్ అన్నారు.

“ఇలా వ్యాక్సీన్లను ధ్వంసం చేయడం విచారకరం. కానీ, అలా చేయడం వల్ల వచ్చే ముప్పు కంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి” అని మలావి ఆరోగ్య కార్యదర్శి బీబీసీ కి చెప్పారు.

                  “మా దగ్గర గడువు తేదీ ముగిసిన వ్యాక్సీన్లు ఉన్నట్లు వార్తలు రాగానే, వ్యాక్సినేషన్ కోసం ప్రజలు రావడం లేదనే విషయాన్ని గమనించాం” అని డాక్టర్ ఛార్లెస్ మాన్సామ్బో చెప్పారు.”వాటిని గనక మేము కాల్చి ధ్వంసం చేయకపోతే, మేము వాటినే వాడుతున్నామని అనుకుని ప్రజలు వ్యాక్సినేషన్ కోసం రాకపోవచ్చు. అలాంటి వారికి కోవిడ్ సోకే ప్రమాదం ఉంది” అని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం ప్రజలను ఒప్పించడం కష్టం కావడం వల్లే ఆ వ్యాక్సిన్లు వ్యర్థం అయ్యాయని చెప్పారు.సౌత్ సుడాన్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఆ దేశంలో గడువు ముగిసిన సుమారు 59,000 వ్యాక్సీన్లు ఉన్నాయి. ఇవి వారికి ఆఫ్రికన్ యూనియన్ నుంచి అందాయి.గడువు తేదీని పొడిగించవచ్చేమో అనే అంశాన్ని పరిశీలించే వరకు వాటిని భద్రంగా ఉంచమని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు వాటిని పారేయమని చెబుతోంది.

                                     “వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు జరుగుతున్న సమయంలో వ్యాక్సీన్లను నాశనం చేయడం విచారకరమైన విషయమే అయినప్పటికీ గడువు తేదీ ముగిసిన వ్యాక్సిన్లను సురక్షితంగా ధ్వంసం చేయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో చెప్పింది.ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ల వాడకానికి ఆమోదం లభించక ముందే వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు వాటిని ఉత్పత్తి చేసి స్టాక్ ‌ నిల్వ చేయడంతో వాటి షెల్ఫ్ లైఫ్ తగ్గిపోయిందని కోవాక్స్ పథకాన్ని నిర్వహించే గావి చెబుతోంది. వ్యాక్సీన్ గడువు తేదీ గురించి కోవాక్స్ భాగస్వామ్య దేశాలన్నిటికీ తెలియచేశామని, ఆయా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపిన తర్వాతే వ్యాక్సీన్ డోసులను సరఫరా చేసినట్లు గావి ప్రతినిధి బీబీసీకి చెప్పారు. .ఈ విడత తర్వాత విడుదల చేసే వ్యాక్సీన్ల గడువు తేదీని పొడిగించే అవకాశం ఉన్నట్లు కూడా గుర్తించాలని చెప్పారు. ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాలను జాతీయ రెగ్యులేటర్లకు తెలియచేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here