I WITNESS NEWS / Bureau Report
చైనా లోని ఊహాన్ వైరాలజి ల్యాబ్ లోనే కరొనా వైరస్ పుట్టినది అనే ఆరోపణలు నిజం అని అనుకోవడానికి మరో ఆదారం కూడా లభించినధి. చైనా లోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్‌లో అంటే చైనా లో కరొనా బయట పడటానికి ముంధే అనారోగ్యానికి గురయ్యారని, తమకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని వారు కోరారని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ అమెరికా రహస్య నివేధిక ప్రకారం ఒక రిపోర్ట్ ప్రచురించింది. వుహాన్ ల్యాబ్‌లో జబ్బు పడిన పరిశోధకుల సంఖ్య, వారు అనారోగ్యానికి గురైన సమయం, ఆస్పత్రిలో వారు పొందిన చికిత్సకు సంబంధించిన విషయాలను ఈ నిఘా రిపోర్టులో వివరించారు. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనావైరస్ వ్యాపించిందని వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఈ నిఘా రిపోర్టులోని సమాచారం బలమైన ఆధారంగా నిలుస్తుందని భావిస్తున్నారు.కరోనావైరస్ మూలాలకు సంబంధించి తదుపరి విచారణపై చర్చించడానికి డబ్ల్యుహెచ్ఓ సమావేశం కానుంది. దానికి ఒక్క రోజు ముందు ఈ రిపోర్ట్ వెల్లడైంది.
దర్యాప్తుపై సీరియస్‌గా బైడెన్ ప్రభుత్వం
వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంపై అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కానీ కరోనావైరస్ మూలాల దర్యాప్తుపై బైడెన్ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఆయన చెప్పారు.
ఇంతకు ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఒక టీమ్ మహమ్మారికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు వుహాన్ వెళ్లింది.
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వ్యాపించిందనడానికి తగిన ఆధారాలు లేవని తర్వాత డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌ను ‘చైనా వైరస్’, ‘వుహాన్ వైరస్’ అనేవారు. చైనా దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఈ దర్యాప్తులో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందానికి చైనా పూర్తిగా సహకరించలేదని, వుహాన్ ల్యాబ్‌కు సంబంధించిన సమాచారం దాచిపెట్టిందని ఆరోపణలు కూడా ఉన్నాయి.
-By BALA.RAVITEJA